View News

news
 
 
1
ప్రియుడితో శృతి హాసన్ వివాహం?
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుటుంబంలో పెళ్లి భాజా మ్రోగ బోతోందా? ఆయన కూతురు, హీరోయిన్ శృతి హాసన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి చెన్నై సినీ వర్గాల నుండి. శృతి హాసన్ ఓ విదేశీయుడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటాలియన్ సంతతికి చెందిన మైఖేల్ కోర్సేల్‌తో శృతి హాసన్ కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. లండన్లో స్టేజ్ యాక్టర్‌గా రాణిస్తున్న మైఖేల్‌ తన ప్రియురాలు శృతి హాసన్ కోసం చాలా సార్లు ఇండియా వచ్చారు. పవర్ స్టార్ తోనే.. కోరిక ని బయటపెట్టిన శృతి.. 04:45 స్టేజ్ మీద కొట్టుకున్న నందు, శ్రీముఖి 02:14 హాలీవుడ్,కొరియా సినిమాలా ఉంటుంది....! త్వరలో శృతి-మైఖేల్ వివాహం? త్వరలో శృతి హాసన్, మైఖేల్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరూ కమల్ హాసన్ తో చర్చించినట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే త్వరలో కమల్ హాసన్ ఇంట్లో శుభకార్యం చూడబోతున్నాం. దాపరికాల్లేకుండా తిరిగిన జంట శృతి హాసన్ ఏ విషయంలో అయినా ఓపెన్ మైండెడ్. ఎలాంటి దాపరికాల్లేకుండా శృతి హాసన్, మైఖేల్ ఇండియాలో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వివాహానికి సిద్ధమైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మైఖేల్‌ను తల్లి సారికకు పరిచయం చేసిన శృతి శృతి హాసన్ తన ప్రియుడిని ఇటీవలే తన తల్లి సారికకు పరిచయం చేసిందట. దీంతో వీరు వివాహం చేసుకోబోతున్నారని, అందుకే సారికను కలిశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే శృతి హాసన్, మైఖేల్ వివాహంపై అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు. కేవలం మీడియాలో వివాహం అంటూ పుకార్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అయితే ఈవార్త నిజం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Published on Thursday, November 30, 2017
2
డిసెంబర్ 31 అర్థరాత్రి గానాబజానాకు రూ.4 కోట్లు
మరో 14 రోజుల్లో 2016 సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే అమితాసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకడానికి నక్షత్ర హోటళ్లు ఇప్పటినుంచే పలు రకాలైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా సినీ నటులతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లోని నటుల మేనేజర్లు రేట్లు ఫిక్స్ చేసి, సంప్రదింపులు జరుపుతుంటారు. ఈ యేడాది కూడా ఓ స్టార్ హోటల్ డిసెంబర్ 31 అర్థరాత్రి గానాబజానాకు ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను సంప్రదించింది. దానికి వెంటనే సన్నీ అంగీకరించింది. తాజాగా విడుదలైన 'రయీస్' సినిమాలోని 'లైలా ఓ లైలా' పాటకు స్టెప్పులు వేయాలని కోరిందని తెలుస్తోంది. ఇందుకు గాను ఆమెకు 4 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నిజానికి షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో నటించినందుకు ఆమెకు అంత మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ముట్టలేదు. కానీ, ఒక్కరాత్రి న్యూఇయర్ బాష్ కోసం ఆమె ఏకంగా రూ.4 కోట్లను డిమాండ్ చేయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
Published on Sunday, December 18, 2016

 

First Previous 1 Next Last 
 
Rewards Achiever List  
 
LaxmiBhavani
TEST
TEST
MAHALAXMI
G.SAIBABA GOUD
Others
TEST
TEST
TEST
TEST
TEST